శ్రీ కృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం

తెలుగు వైభవానికి నిలయం, భాషాభిమానులకు ఆలయం

1901 సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్‌లో స్థాపించబడిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, తెలుగు జాతి చైతన్యానికి, సాంస్కృతిక వైభవానికి సాక్షిగా 123 సంవత్సరాలుగా విజృంభించుతూ విలసిల్లుతోంది. నిజాం రాష్ట్రంలో మొట్టమొదటి తెలుగు గ్రంథాలయంగా ఆవిర్భవించిన ఈ సంస్థ, ఆధునిక యుగంలో తెలుగు సంస్కృతి, సాహిత్యం, భాషా సంప్రదాయాలకు శిఖర ప్రతిష్ఠగా నిలిచింది.

సుమారు 50,000 గ్రంథాల అపూర్వ సంచయం

సాంస్కృతిక కార్యక్రమాలు

సంవత్సరోత్సవాలు: 

రజతోత్సవాలు (1927), స్వర్ణోత్సవాలు (1952), వజ్రోత్సవాలు (1962), అమృతోత్సవాలు (1976), శతాబ్ది ఉత్సవాలు (2002)

జయంతి ఉత్సవాలు మరియు పురస్కారాలు:

బూర్గుల రామకృష్ణరావు జయంతి – ప్రతిభా పురస్కారం

దాశరథి జయంతి – కృష్ణమాచార్య సాహితీ పురస్కారం

రావిచెట్టు రంగారావు జయంతి – తెలుగు భాషా వికాస పురస్కారం

పి.వి. నరసింహారావు జయంతి – స్మారక పురస్కారం

→మరింత సమాచారం

గ్రంథాలయం

తెలుగు సాహిత్యానికి సంబంధించిన వేలాది పుస్తకాలు, పత్రికలు, పరిశోధన గ్రంథాలు ఇక్కడ లభ్యమవుతాయి. పరిశోధకులు, విద్యార్థులు, సాహిత్యాభిమానులు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవచ్చు.

See support programs →

తాజా కార్యక్రమాలు.

2022: తెలుగు భాషా శక్తి కార్యక్రమం
2023: సాహిత్య సదస్సు
2024: తెలుగు భాషా వారోత్సవం

2025:125వ స్థాపక దినోత్సవం

2026 : యువత కోసం

2026: ఇంటర్న్‌షిప్/స్వచ్ఛంద సేవ

మా దృష్టి

తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చేయడం, కొత్త తరాలకు భాషా విలువలను చేరవేయడం

Sri Krishna Devaraya Telugu Bhasha Nilayam
Sri Krishna Devaraya Telugu Bhasha Nilayam earlier known as Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam is one of the oldest non-Government Library in Telangana , this institution has been a central hub for Telugu literature, culture, and the library movement.
It houses a vast collection of rare Telugu books, journals, and old newspapers.
Volunteers are warmly invited to join this grand digitization project to make these treasures accessible to all.

అరుదైన తెలుగు గ్రంథాల సంరక్షణ: మీ వంతు బాధ్యతగా ఓ అడుగు వేయండి

మీకు తెలుగు భాష అంటే ఇష్టం ఉందా? పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టమా?
అయితే, AI టూల్స్ సహాయంతో మన పాత తెలుగు సాహిత్యాన్ని డిజిటల్ రూపంలో భవిష్యత్ తరాలకు అందించే మంచి అవకాశం మీకోసం!
మీరు వాలంటీర్‌గా చేరి, తెలుగు సాహిత్యాన్ని కాపాడే ఈ ప్రయాణంలో భాగమవ్వండి!

📞 వివరాలకు: 9014120442
📧 sktbn.org@gmail.com

ప్రస్తుత కార్యవర్గం

అధ్యక్షులు: డాll కె. వి. రమణాచారి ఐ.ఏ.ఎస్ (రి)

ఉపాధ్యక్షులు: కె. చంద్రప్రకాశ రావు

గౌరవ కార్యదర్శి: టి. ఉదయవర్లు

సంయుక్త కార్యదర్శి: డాll గంగు నరసింహ మూర్తి

కోశాధికారి: కె. జగదీశ్వర రావు

సలహాదారు: డాll ఎస్. సుదర్శన్ రావు

కార్యవర్గ సభ్యులు

యం. శ్రీనివాస రావు

నూతి శంకర రావు

ఆర్. మాధవ రావు

ఎ.వి. జనార్ధన రావు

125వ స్థాపక దినోత్సవం

2025 సెప్టెంబరు 1న భాషా నిలయం 125వ వసంతంలో ప్రవేశించిన సందర్భంగా ఘనమైన వేడుకలు నిర్వహించేందుకు ప్రస్తుత కార్యవర్గం సంకల్పించింది.

.

విరాళాలు

సంస్థకు ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చట్టం 80G కింద మినహాయింపు పొందుతాయి. PAN No.: AAPAS5745N..