
మా గురించి
సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో స్థాపించబడిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, నిజాం రాష్ట్రంలోని తొలి తెలుగు గ్రంథాలయంగా ఆవిర్భవించి, తెలుగు జాతి చైతన్యానికి, భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి మరియు సాంస్కృతిక వైభవానికి 123 సంవత్సరాలకు పైగా నిరంతర సేవలందిస్తూ వెలుగొందుతోంది. తెలుగు సంస్కృతి, సాహిత్య సంప్రదాయాలకు శిఖరప్రతిష్ఠగా నిలిచిన ఈ మహోన్నత సంస్థ, తెలుగు వైభవానికి నిలయం, భాషాభిమానులకు ఆలయంగా తరతరాలకు స్ఫూర్తినిస్తూ విశిష్ట ఖ్యాతిని సంతరించుకుంది
1901 సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో స్థాపించబడిన శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం, నిజాం రాష్ట్రంలోని తొలి తెలుగు గ్రంథాలయంగా ఆవిర్భవించి, తెలుగు జాతి చైతన్యానికి, భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి మరియు సాంస్కృతిక వైభవానికి 123 సంవత్సరాలకు పైగా నిరంతర సేవలందిస్తూ వెలుగొందుతోంది. తెలుగు సంస్కృతి, సాహిత్య సంప్రదాయాలకు శిఖరప్రతిష్ఠగా నిలిచిన ఈ మహోన్నత సంస్థ, తెలుగు వైభవానికి నిలయం, భాషాభిమానులకు ఆలయంగా తరతరాలకు స్ఫూర్తినిస్తూ విశిష్ట ఖ్యాతిని సంతరించుకుంది
అరుదైన గ్రంథాలు, తాళపత్ర వ్రాతప్రతులు, పురాతన పత్రికలతో నిండిన ఈ నిలయం తెలుగు వారసత్వానికి సజీవ సాక్ష్యం.
తెలుగు భాష, సాహిత్యం, కళలను పెంపొందించే వార్షిక కార్యక్రమాలు
కవి సమ్మేళనాలు, పుస్తక ఆవిష్కరణలు, సాహిత్య చర్చలు నిరంతరం జరుగుతాయి.
వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, పఠన అలవాట్లను పెంచే కార్యశాలలు.
తెలుగు పండుగలు, జయంతులు, స్మారక సభలను ఘనంగా నిర్వహిస్తాం.
125వ వార్షికోత్సవం
సెప్టెంబరు 1, 1901 సంవత్సరంలో (ప్లవ నామ సంవత్సరం శ్రావణ బహుళ తదియ ఆదివారం) వెలిగిన జ్ఞానదీపం నేటికీ ప్రకాశిస్తోంది. 125 సంవత్సరాల ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక సాహిత్య, సాంస్కృతిక వేడుకలను నిర్వహిస్తున్నాం. ఈ వారసత్వ ప్రయాణంలో మీరూ భాగం కావండి.
సంవత్సరాల సేవ
స్థాపన సంవత్సరం
జయంతి ఉత్సవాలు & పురస్కారాలు:
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం (పూర్వనామం: శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం) 1901 సెప్టెంబర్ 1న స్థాపించబడిన తెలంగాణలోని మొట్టమొదటి గ్రంథాలయం.
నేటి అమూల్య సంపద 🔗
సుమారు 50,000కు పైగా అరుదైన గ్రంథాలు, తాళపత్ర ప్రతులు, పాత పత్రికలు మరియు చారిత్రక దస్తావేజులు.
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం వారి 125వ వార్షికోత్సవం (సమగ్ర శతాబ్ది ఉత్సవాలు) సందర్భంగా వెలువడనున్న ప్రత్యేక సంకలనానికి “నాకు నచ్చిన నా తెలుగు” అనే అంశంపై రచనలు ఆహ్వానిస్తున్నాము.
📅 చివరి తేదీ: 2026 ఆగస్టు 15
📧 ఇ-మెయిల్: sktbn.org@gmail.com
తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చేయడం, ఆధునిక సాంకేతికత & డిజిటలైజేషన్ ద్వారా నవతరానికి భాషా విలువలను చేరవేయడం.
అధ్యక్షులు: డాll కె. వి. రమణాచారి IAS (రి)
ఉపాధ్యక్షులు: కె. చంద్రప్రకాశ రావు
గౌరవ కార్యదర్శి: టి. ఉదయవర్లు
సంయుక్త కార్యదర్శి: డాll గంగు నరసింహ మూర్తి
కోశాధికారి: కె. జగదీశ్వర రావు
సలహాదారు: డాll ఎస్. సుదర్శన్ రావు
కార్యవర్గ సభ్యులు: యం. శ్రీనివాస రావు, నూతి శంకర రావు, ఆర్. మాధవ రావు, ఎ.వి. జనార్ధన రావు
ఈ చారిత్రక గ్రంథాలయం 2025 సెప్టెంబరు 1 నాటికి 125వ వసంతంలోకి (Supercentenary) అడుగుపెట్టింది. ఈ సందర్భంగా డిజిటలైజేషన్ ప్రక్రియను (Digital Library Initiative) వేగవంతం చేస్తూ సరికొత్త పుటలను లిఖిస్తోంది.
సంస్థకు ఇచ్చే విరాళాలు ఆదాయపు పన్ను చట్టం 80G కింద మినహాయింపు పొందుతాయి.
PAN: AAPAS5745N