హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటి గ్రంథాలయం. 1901 సెప్టెంబరు 1న (ప్లవ నామ సంవత్సరం) స్థాపించబడిన ఈ సంస్థ, తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి కేంద్రబిందువుగా నిలిచింది. రాబర్ట్ సీవెల్ రచించిన ‘A Forgotten Empire’ పుస్తకం ద్వారా విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వైభవాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ భాషానిలయానికి ఆ మహానుభావుని పేరు పెట్టడం జరిగింది.

మునగాల రాజా నాయని వెంకట రంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మరియు రావిచెట్టు రంగారావు గార్ల అకుంఠిత దీక్ష ఈ సంస్థ స్థాపనకు మూలస్తంభాలు.

Sri Krishna Devaraya Telugu Bhasha Nilayam Building